Thursday, 5 November 2026

119 డివిజన్ లో ప్రజల సమస్యల పై అధ్యయనం చేస్తున్న వడేవల్లి శరన్ చౌదరి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న బిజెపి నాయకత్వం

 

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 10 ఓల్డ్ బోయినపల్లి రాబోయే ఎన్నికలలో కూకట్ పల్లి నియోజకవర్గంలో భాజపా గెలుపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు బిజెపి సీనియర్ నాయకులు వడేవల్లి శరన్ చౌదరి అన్నారు.
ఓల్డ్ బోయిన్ పల్లి లోని పలు డివిజన్లలో బీజేపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, ధర్మ, ఏనుగుల తిరుపతి, సాధు ప్రతాప్ రెడ్డిలతో కలిసిఆయనపాదయాత్రలో పాల్గొన్నారు.ఈసందర్భంగా వడేవల్లి శరన్ చౌదరి మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలోని హెచ్ఐఎల్ పార్క్ నుండి సమతా నగర్ మీదుగా ఇంటింటికీ తిరుగుతూ కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల అవగాహనకల్పించమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలు అనేక సమస్యలతో, ఇబ్బందులుఎదుర్కొంటున్నారని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాక, రేషన్ కార్డులు, పింఛన్లు లేక, ప్రజలకు సరైన మౌలిక వసతులు కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను బంగారు మయం గామారుస్తామని చెప్పి భూకబ్జాలకు పాల్పడుతూ అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.