హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్ తెలంగాణ బిల్లు పెట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌కు తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆగస్టు 12 వ తేదీ అర్ధ్రరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని టీఎంయూ స్పష్టం చేసింది. 12 న మధ్యాహ్నం అన్ని ఆర్టీసీ డిపోల ముందు సమ్మె సన్నాహాక సభలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ కార్మికులను రెచ్చగొట్టే విధంగా సీమాంధ్ర కార్మికులు ప్రకటనలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.




