దమ్ముంటే ఆ మాట ప్రధానిని చెప్పమనండి

బీజేపీ, వైకాపాలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి

చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకోసమే ప్రధానిని గౌరవించారు

ఎవరికీ భయపడి కాదు

మంత్రి నక్కా ఆనందబాబు

గుంటూరు, జూన్‌18(జ‌నం సాక్షి) : రాష్టాన్రికి ఎదో చేశామని బీజేపీ నాయకులు చెబుతూన్నారని, దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మాట చెప్పాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీ నేతలు దాగుడు మూతలు ఆడుతూ రాష్ట ప్రయోజనాలను దెబ్బతిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రిని గౌరవించరే తప్ప, ఎవరికీ భయపడి కాదన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వ్యంగ్యంగా మాట్లాడుతూన్నారని, ప్రత్యేక ¬దా, విభజన చట్టంలో హావిూలను నెరవేర్చాలని మరోసారి డిమాండ్‌ చేశారు. నీతిఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారని, జగన్‌ కేసుల మాఫీ కోసం బీజేపీతో కుమ్మక్కై దొంగ నాటకాలు ఆడుతున్నారని నక్కా ఆరోపించారు. జగన్‌ విభజన హావిూలు నెరవేర్చాలని ప్రధానమంత్రిని ఏనాడైనా నిలదీశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి త్యాగాలకైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌నర్సింహారావు రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా అంటూ ఆనందబాబు ప్రశ్నించారు.