Thursday, 5 November 2026

ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తే చర్యలు తప్పవు…..

–తహశీల్దార్ యండి మాజీద్
వీర్నపల్లి అక్టోబర్ 27 (జనంసాక్షీ):-
వీర్నపల్లి మండలంలోని గ్రామాలలో ఎన్నికల త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఆస్తులపై అలాగే ప్రజల ఇంటి గోడలపై అనుమతి లేకుండా రాసిన పార్టీ ఎన్నికల ప్రచారాలను పేర్లను గ్రామాల్లో ఉన్న పార్టీ జండాలను ఈ రోజు మండల రెవెన్యూ శాఖ సిబ్బంది తొలగించడం జరిగింది,ఈ సందర్భంగా ఎమ్మార్వో ఎం ఏ మజీద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల కార్యకర్తలు నాయకులు అనుమతులు లేని ప్రచారాలు చేయరాదని ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు