Wednesday, 4 November 2026

138 కోట్ల విలువైన ఉపాధి హావిూ పనులు చేపట్టవచ్చు:కలెక్టర్‌

శ్రీకాకుళం, నవంబరు 22 : మహాత్మా గాంధీ జాతీయం ఉపాధి హామి పథకం మెటీరియల్‌ కాంపోంట్‌ క్రింద జిల్లాలో రూ. 138 కోట్ల పనులు చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. ఉపాధి హామి, వ్యక్తిగత మరుగుదొడ్లను విూ సేవా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురు వారం శ్రీకాకుళం డివిజన్‌  స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామి పనులుగా ఎస్‌.సి., ఎస్‌.టి ప్రాంతాల్లో సి.సి రహదారులు, గ్రావెల్‌ రహదారులు, , సాగునీటి పనులైన తూముల నిర్మాణం, కాలువల లైనింగ్‌ పనులతోపాటు, భవనాలనుకూడా నిర్మించవచ్చని చెప్పారు. ఈ పనులన్ని మెటీరియల్‌ కాంపోంటుగా మాత్రమే చేపట్టాలని ఆయన  స్పష్టం చేసారు. గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకోవాలని ఆయన చెప్పారు. సి.సి రహదారులులేని ఎస్‌.సి., ఎస్‌.టి కాలనీలు ఉండరాదని ఆయనపేర్కొన్నారు. పనులకు చెల్లింపులు గ్రామ పంచాయతీ ద్వారా ఉంటుందని, గ్రామ పంచాయ/హతీ పనులను పర్యవేక్షిస్తుందని చెప్పారు. మండలాల్లో వంద రోజుల పనిదినాలు పూర్తిచేసుకోని వారికి పనులు కల్పించాలని లక్ష్యనిర్దేశర చేసారు. పనులకు డిమాండ్‌ రావాలని, పనుల మంజూరు ఉత్తర్వులు అందించాలని ఆయనఆదెశించారు. ఇంత వరకు చక్కటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పనులు చేపట్టారని, ఇకపై మరింత చక్కగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. స్థూల జాతీయ ఉత్పత్తి, తలసరి ఆదాయంలో జిల్లా స్థానాన్ని మెరుగుపరచాలని ఆయ/హ అన్నారు. మండల మహీళా సమాఖ్యల భవనాలు, గ్రామ పంచాయతీలు భవనాలు త్వరితగతి నిర్మించుటకు చర్యలు చేపట్టాలని ఆయన  అన్నా. విూ సేవా కార్యక్రమంలో రిజిస్టేష్రన్‌  శాఖకు చెంది పత్రాలను జారీకి పెట్టాలని కలెక్టర్‌ ఆదెశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లను పెద్ద ఎత్తు చేపట్టాలని కలెక్టర్‌ ఆదెశించారు. ప్రతి మండలంలో కనీసం 2,500 మరుగు దొడ్లనునిర్మించాలని, ఈ ఏడాదిలో లక్ష మరుగు దొడ్లను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లాల్లో వంద రోజుల్లో లక్ష మరుగు దొడ్లను నిర్మించారని ఆయనపేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *