హైదరాబాద్: హైదరాబాద్‌లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియమ్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం డీలర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక అమలు చేయాలని ఈ నెల 15 నుంచి పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ఈ నెల 15 నుంచి కేవలం ఒక్కపూట మాత్రమే పెట్రోలియం బంక్‌లు పని చేస్తాయని వారు తెలియజేశారు. హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌లు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, హైవేల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని స్పష్టం వ్యక్తం చేశారు.




