సర్దార్ పాపారాయుడికి మంత్రి నివాళి
హైదరాబాద్,అగస్టు16(జనంసాక్షి): అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన జయంతి సబ్బండ వర్గాల ప్రజలకు పండుగ రోజని చెప్పారు. సర్వాయి పాపన్న 371వ జయంతి సందర్భంగా చిక్కడపల్లిలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. తాటి, ఈత చెట్ల పన్నులను రద్దు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నారని వెల్లడిరచారు. గౌడ వృత్తిదారులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని తెలిపారు.