Tuesday, 3 November 2026

1.వరదబాధితులకు సీఎం కేసీఆర్‌ భరోసా
` శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటాం
` భద్రాచలానికి రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయం
` బాధితులకు తక్షణ సహాయంగా రూ.10వేలు
` రెండు నెలల వరకు 20 కేజీల ఉచిత బియ్యం అందిస్తాం
` భారీ వర్షాలు వున్నాయి.. నెలాఖరు వరకు అప్రమత్తంగా వుండండి
` భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు సీఎం ఏరియల్‌ సర్వే
` ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగంపై ప్రశంశలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో(జనంసాక్షి):భద్రాచలం గోదావరి వరద బాధితులకు ముఖ్యమంత్రి కె సి ఆర్‌ భరోసా ఇచ్చారు. ఆదివారం గోదావరి ముంపు జిల్లాల పర్యటనలో భాగంగా ములుగు, ఏటూ రునాగారంలో పర్యటించి అనంతరం భద్రాద్రి జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు జిల్లాలను సందర్శించాలనుకున్న కె సి ఆర్‌.. వాతావరణం అనుకూలించక పోవడంతో రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకున్నారు. ముందుగా గంగమ్మ తల్లికి శాంతి పూజలు నిర్వహించి ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి వంతెన విూద నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తో కలిసి సీఎం పర్యవేక్షించారు. గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించి అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం భద్రాచలం జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకొని ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకుకొని బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి ఆరా తీసి అందరినీ పేరుపేరునా పలకరించారు. అనంతరం గోదావరి వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, హరీశ్‌ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఐటిడిఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సవిూక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఅర్‌ మాట్లడుతూ..
భద్రాచలంలో గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం చాలా బాధాకరమని, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు వరదల నుండి పూర్తిగా విముక్తి కలిగేలా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామన్నారు. ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అనుహ్యంగా చాల ఏండ్ల తర్వాత రికార్డ్‌ స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని తద్వారా జిల్లాలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు చాలా దెబ్బతిన్నాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం, అధికారుల అప్రమత్తం వల్ల అలాంటి ఘటన ఏక్కడ జరగలేదన్నారు. పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ దళాలు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం జరగలేదని వారిని ప్రశంసించారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధ్వర్యంలో కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు గొప్పగా పని చేసి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు.
7,274 కుటుంబాలకు ఆర్థిక సాయం..
వరదల వల్ల 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారని, బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి మరో రెండు నెలల పాటు 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తామన్నారు. ఈ నెలాఖరు వరకు లెక్కల ప్రకారం భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మళ్లీ గోదావరికి వరదలు సంభవించే అవకాశం ఉందని, ముంపు ప్రాంతాల కుటుంబాలను ఈ నెల 29 తేదీ వరకు పునరావాస కేంద్రాలలోనే వుండేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తాం
కనీసం 50 అడుగుల గోదావరి వరదలకే భద్రాచలం లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి భద్రాచలం పట్టణం వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని, సింగరేణి కాలరీస్‌, ప్రభుత్వం కలిసి రూ. 1000కోట్లతో రెండు, మూడు వేల ఇండ్లతో కాలనీ నిర్మించబోతున్నామన్నారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటారని, భద్రాచలం, పినపాక నియోజక వర్గాలలో వరద బాధలు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. గోదావరికి వరద 90 అడుగుల మేర వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతామన్నారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.ఎత్తైన ప్రాంతంలో కాలనీ నిర్మాణానికి సీఎస్‌ చర్యలు తీసుకుంటారని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
భగవంతుడి దయ వల్లే కడెం ప్రాజెక్టు బతికింది..
గోదావరికి 1986లో భారీ వరదలు వచ్చాయని, మారిన పరిస్థితుల కారణంగా మళ్లీ అలాంటి వరదలు వచ్చే అవకాశం ఉందని, మనం ఊహించని విధంగా చరిత్రలో కని వినీ ఎరుగని విధంగా కడెం ప్రాజెక్టులో భారీ వరద వచ్చి చేరిందన్నారు. గతంలో ఎన్నడూ కూడా రెండున్నర లక్షల క్యూసెక్కులు దాటలేదని, భారీ వర్షాల కారణంగా ఈసారి 5 లక్షల క్యూసెక్కులు దాటిందని, నిజంగా చెప్పాలంటే భగవంతుడి దయవల్లే ఆ ప్రాజెక్టు బతికిందని కేసీఆర్‌ పేర్కొన్నారు.
ఈ నెల 29 వరకు వర్షాలున్నాయి.. అప్రమత్తంగా వుండండి
వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తుంటాయని కేసీఆర్‌ తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. 29 వరకు ఇదే పద్ధతిలో వర్షం ఉంటుందని, ప్రమాదం ఇంకా తప్పిపోలేదని, మరో మూడు నెలలు వర్షాలు వచ్చే అవకాశం ఉందని, అందరం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.చివరి వరకు క్యాంపులు ఉండేలా చూడాలని, పూర్తి స్ధాయిలో వరదలు పోయాక ఒక నిపుణుల టీమ్‌ ను భద్రాచలం కు పంపిస్తామని పేర్కొన్నారు.ఈ సవిూక్షా సమావేశంలో సిఎస్‌ సోమేష్‌ కుమార్‌, మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,వనమా, మెచ్చా,జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంలో గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్‌ శాంతి పూజలు :
తొలుత భద్రాచలం సవిూపంలోని సారపాక వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను బ్రిడ్జి విూద నుంచి సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. అక్కడ గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్‌ శాంతి పూజలు జరిపారు. పసుపు, కుంకుమలు చల్లి సారె, సమర్పిచారు. అక్కడి నుంచి కరకట్ట వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాన్ని నిశితంగా పరిశీలించారు. కరకట్ట పటిష్టత కోసం చేపట్టవలసిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. పునరావాస కేంద్రంలో బాధితులను పరామర్శించిన సీఎం : అనంతరం భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.
భద్రాచలం నుంచి ఏటూరు నాగారం.. సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే..
భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్‌ ఏటూరు నాగారం బయల్దేరారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం హెలికాప్టర్‌లో ఏటూరు నాగారం చేరుకున్నారు.
అంతకుముందు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన కోసం శనివారం వరంగల్‌ జిల్లాకు చేరుకొని సవిూక్షించిన సీఎం కేసీఆర్‌ హన్మకొండలో బస చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ముందుగా భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ పర్యటించి, ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించి సవిూక్ష జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఏటూరు నాగారం వరకు సీఎం కేసీఆర్‌ హెలీకాప్టర్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అక్కడ కూడా వరద బాధితులను పరామర్శించి, సవిూక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఏటూరునాగారం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ ఆదివారం రాత్రికి హన్మకొండకు చేరుకున్నారు.

2.విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ అల్వా
న్యూఢల్లీి(జనంసాక్షి):విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్‌ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్‌ పేరును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. గోవా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. ఆమె కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. ఆమె స్వస్థలం కర్నాటక. 1942 ఏప్రిల్‌ 14న కర్నాటక మంగళూరులో జన్మించారు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978 , 1980 మధ్య కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.ఏప్రిల్‌ 1974లో మార్గరెట్‌ అల్వా కాంగ్రెస్‌ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఉన్న సమయంలో పలు స్టాండిరగ్‌ కమిటీల్లో సేవలందించారు. 1984`85 మధ్య పలుశాఖలకు మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం అధికార ఎన్‌డీయే కూటమి తమ అభ్యర్థిగా జగ్‌దీప్‌ ధన్‌ఖఢ్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది.

 

5.వరద బాధితుల సమస్యలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తా
` వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన
అశ్వాపురం(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు.ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు తమ సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని తమిళిసై సందర్శించారు. ముంపు బాధితుల సమస్యలు విన్నానని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సాయంత్రం చింతిర్యాల, గౌతమినగర్‌ ప్రాంతాల్లో ఆమె పర్యటించి వరద సహాయక సామగ్రిని అందజేయనున్నారు.

 

 

6.మోదీ… ఎంత ఠూటా మాటా
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశావా!
` నిరూపిస్తావా..!` వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఫైర్‌
` రైతులకు ఇచ్చిన హావిూలను విస్మరించారు..
` రాష్ట్రాలకు కనీస ప్రోత్సాహం లేదని ధ్వజం
హైదరాబాద్‌ (జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎరువుల ధరలతో పాటు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను రెట్టింపు చేశారని, తద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయని మంత్రి మండిపడ్డారు. పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేశారు తప్ప రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హావిూ ఇచ్చినట్లు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు అమలు చేయడం లేదన్నారు. దేశంలో పండే 53 పంటలకు గాను కేవలం 29 పంటలకే కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారు. అందులో ప్రధానంగా నాలుగైదు పంటలనే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా పండిన పంటలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.ఉపాధిహావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హావిూని తుంగలో తొక్కారని నిరంజన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల వ్యవసాయ మోటార్లకు విూటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి వ్యవసాయ రంగం పట్ల ఒక సమగ్ర విధానం గానీ, ప్రణాళిక గానీ లేదన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల ఆందోళనలకు కారణమయ్యారని మండిపడ్డారు. చట్టాలు ఉపసంహరించుకున్నప్పుడు రైతులకు ఇచ్చిన హావిూలను విస్మరించారు. రైతులను మోసం చేయడం, మభ్యపెట్టడం తప్ప వారికి మేలు చేయాలన్న ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పంట ఉత్పత్తులు పెంచుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రోత్సాహం లేదని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. స్వయం సామర్ధ్యంతో అధిక ఉత్పత్తి సాధించిన తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నది. పైగా వరి సాగు పెంచాలని రాష్ట్రాలను కోరుతున్నది. అసలు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం, కొనుగోళ్ల విధానాలపై స్పష్టమయిన విధానం లేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు.

7.శ్రీశైలానికి భారీగా వరద
` ప్రాజెక్టులోకి 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం(జనంసాక్షి): ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 3,06,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. జూరాల స్పిల్‌వే నుంచి 1,17,323 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మరో 35,989 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1,52,585 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వస్తున్నది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 861.40 అడుగుల మేర నీరున్నది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 110.3410 టీఎంసీల నీరుందని అధికారులు తెలిపారు. ఎడమగట్టులో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుండగా.. 25,427 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వెళ్తున్నది.

8.ఎట్టకేలకు పార్లమెంట్‌లో తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లు!
` 8 ఏండ్ల తర్వాత మేల్కొన్న కేంద్రం..
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎనిమిదేండ్ల తర్వాత కేంద్రం మేల్కొన్నది. ఎట్టకేలకు పార్లమెంట్‌లో తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్ర ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించే యోచనలో ఉంది.అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు`2022ను తీసుకురానున్నట్లు రాజ్యసభ బులెటిన్‌లో వెల్లడిరచారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో గిరిజన యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. ములుగు జిల్లా జకారం గ్రామంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది.

 

9.మహారాష్ట్రలో వర్ష బీభత్సం..
` 104మంది మృతి
` ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి, ఇంద్రావతి నదులు
ముంబయి(జనంసాక్షి): మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.వర్షాకాలం మొదలైనప్పట్నుంచి (జూన్‌ 1)నుంచి ఇప్పటివరకు వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో దాదాపు 104 మంది మృతిచెందినట్టు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన సంస్థ అధికారులు వెల్లడిరచారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. జూన్‌ 1 నుంచి జులై 16 వరకు 104 మంది మృతిచెందగా.. గడిచిన 24గంటల వ్యవధిలో జల్‌గావ్‌, అమరావతి జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు.భారీ వర్షాలకు తోడు వరదలు, కొండ చరియలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, నిర్మాణాలు కూలిపోవడం వంటి ఘటనలు కూడా అధిక ప్రాణ నష్టానికి కారణమని తెలిపారు. ముంబయి, పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయని.. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయని వివరించారు. ముంబయిలో ఆదివారం వాతావరణం పొడిగా ఉన్నట్టు పేర్కొన్నారు.గోదావరి, ఇంద్రావతి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని.. అలాగే, మరో మూడు నదులు కూడా ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటివరకు గడ్చిరోలి జిల్లాలో 10,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు తెలిపింది.

10.జార్ఖండ్‌లో విషాదం
` పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
రాంచీ(జనంసాక్షి):ఫ్యామిలీ టూర్‌ విషాదంగా మారింది. పడవ బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. జార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్‌ధన్‌వార్‌ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఆదివారం ఉదయం పంచఖేరో డ్యామ్‌ వద్దకు వెళ్లింది. ఒక అద్దె పడవలో షికారుకు వెళ్లారు. అయితే ఆ పడవ డ్యామ్‌లో బోల్తా పడిరది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిలో 8 మంది నీటిలో మునిగి మరణించారు. మృతులను శివమ్‌ సింగ్‌ (17), పాలక్‌ కుమారి (14), సీతారాం యాదవ్‌ (40), సెజల్‌ కుమారి (16), హర్షల్‌ కుమార్‌ (8), భావ (5), రాహుల్‌ కుమార్‌ (16), అమిత్‌ కుమార్‌ (14)గా గుర్తించారు.కాగా, ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్‌ కుమార్‌, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, జాతీయ విపత్తి ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందం వెంటనే రంగంలోకి దిగారు. డ్యామ్‌లో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ డ్యామ్‌ వద్దకు చేరుకున్నారు.