Thursday, 5 November 2026

18న ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రభంజనంల తరలి వెళ్లాలి

* ఇల్లందు నియోజకవర్గంలో నుండి 50వేల మంది జన సమీకరణ
* ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ

టేకులపల్లి, జనవరి 17( జనం సాక్షి): రేపు ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఇల్లందు నియోజకవర్గము నుండి 50వేల మందిని ప్రభంజనంలా తరలిస్తామని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో బిఆర్ఎస్ జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కెసిఆర్ మొట్టమొదటిసారిగా జరపతలపెట్టే భారీ బహిరంగ సభకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ గత వారం రోజుల నుండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అందులో భాగంగా టేకులపల్లి మండలంలో ఏజెన్సీ గ్రామాలైన మారుమూల ప్రాంతాల సైతం పర్యటించి బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే విధంగా, వాటితోపాటు త్రాగునీరు, విద్య, వైద్యం, రహదారులు పై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. గడచిన పాలకుల పనితీరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు ప్రజలకి అర్థమవుతుందని, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీస్సులు అందించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బహిరంగ ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరిస్తూతెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేయాలని,రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని, ప్రజా ప్రతినిధులు ,నాయకులు సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు శ్రమించాలన్నారు.
గ్రామస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు , అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పనిచేసిన వారికి పార్టీ