Tuesday, 3 November 2026

18న పాలమూరులో సీఎం

u9kb4pb5

హైదరాబాద్ ,జనంసాక్షి,ఈ నెల 18న మహబూబ్ నగర్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు. మురికివాడలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష జరుపుతారు.
మురికివాడలు లేని నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇటీవల నాలుగు రోజులు వరంగల్ నగరంలో పర్యటించిన ఆయన తొమ్మిది మురికివాడలను సందర్శించారు. సుమారు మూడు వేల పక్కా ఇళ్లు కట్టించేందుకు భూమి పూజ చేశారు. ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *