చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలం లింగాపురంపాడులో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గ్రామానికి చెందిన ఓ బియ్యం వ్యాపారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసుకున్నాడు.దీంతో సమాచారం అందుకున్న మండల తహసీల్దారు సంధ్యారాణి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారులు కేసు నమోదు చేశారు. సదరు వ్యాపారి పరారీలో ఉన్నట్టు సమాచారం.




