హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తిపన్ను వసూళ్ల కోసం ఇళ్ల ముందు చెత్తడబ్బాలు ఉంచడం ఏంటంటూ ప్రశ్నించింది. పన్ను వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గంటలోపు ఇళ్లముందు ఉంచిన చెత్తడబ్బాలు తొలగించాలని, లేకుంటే కమిషనర్, అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది.




