ఢిల్లీ:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన స్వంత నియోజకవర్గం అమేథిలో ఈనెల 18 నుంచి 20 వరకు పర్యటించనున్నారు. 19న ఆయన కాసర గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రాజీవ్‌సింగ్ వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా తన ఎంపీ నిధుల ద్వారా పూర్తి చేసిన పలు ప్రాజెక్టులను రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. మొన్నటి అకాల వర్షాల కారణంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను రాహుల్ పరామర్శించనున్నారు.




