Tuesday, 3 November 2026

వరదల వల్ల మృతిచెందినవారికి రూ. 2లక్షల పరిహారం

హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల సహాయకచర్యల ఏర్పాట్లపై మంత్రి రఘువీరారెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారని మంత్రి తెలిపారు. వరదల వల్ల మృతి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం చెల్లించనున్నట్లు మంత్రి ప్రకటించారు. భారీ వర్షాలకు 5,204 ఇళ్లు దెబ్బతిన్నాయని, 804 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా 480 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. మరో 48 గంటలపాటు భారీవర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *