Tuesday, 3 November 2026

2కోట్ల చేప విత్తనాలు పంపిణీ చేస్తాం:పోచారం

9yg0cal3హైదరాబాద్ : జూన్ నాటికి 2కోట్ల చేప విత్తనాలు పంపిణీ చేయడమే తమ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 11 కోట్లతో 78 రిజర్వాయర్ లలో చేప విత్తనాల పెంపకం జరుగుతుందన్నారు. విత్తనాల కొనుగోలుకు మత్స్యకారులకు 50 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించారు. చేప విత్తనాల పంపిణీలో దళారీ జోక్యాన్ని నివారిస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖతో కలిసి మార్చిలోగా తెలంగాణలో కొత్త ఫిష్ పాండ్స్ నిర్మిస్తామన్నారు. పాతవాటికి మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఫిష్ పాండ్ల నిర్మాణానికి రూ. 4 కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *