Thursday, 5 November 2026

2 కే రన్ విజయవంతం చేయండి _ ఎఎస్పీ కాంతిలాల్ పాటిల్,భైంసా టౌన్ సి. ఐ ఎల్. శ్రీనివాస్

 

భైంసా రూరల్ జూన్ 11జనం సాక్షినిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్దిఉత్సవాలు పురస్కరించుకొని సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ను నిర్వహించనున్నారు.2 కే రన్ ను విజయవంతం చేయాలని ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, పట్టణ సి.ఐ.ఎల్ శీనివాస్ కోరారు. సోమవారం ఉదయం 6 గంటలకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి 2 కే రన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇందులో అధిక సంఖ్యలో యువత, పట్టణవాసులు పాల్గొనాలని కోరారు.