చౌటుప్పల్ : నల్గోండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం శివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగింది. 20మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్‌నుంచి మణుగురుకు వెళ్తున్న బస్సు మాల్కాపురం శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. చౌటుప్పల్ ఎస్సై నరసింహ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.




