కాగజ్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని పోతుపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. పోతుపిల్లి గ్రామంలో 303 ఓటర్లకు వాగు అవలివైపు ఉన్న గుంట్ల పేట లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోలేక పోతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు.




