Monday, 2 November 2026

ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్: పోచారం

మెదక్: రాగల ఐదేళ్లలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. తెలుగు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న చంద్రబాబు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణపట్నంలో కావాలనే విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, టీటీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *