Tuesday, 3 November 2026

రైల్లో మహిళకు నిప్పుపెట్టిన యువకుడు

కోజికోడ్‌: రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు నిప్పు పెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఖాళీగా ఉన్న ఓ కంపార్ట్‌మెంట్‌లో మహిళపై మద్యంపోసి అగ్గిపుల్ల గీసి అంటించాడో వ్యక్తి. మంటల్లో చిక్కుకున్న ఆమె హాహాకారాలు చేస్తూ పరుగులు తీయగా అతను తప్పించుకుపారిపోయాడు. చికిత్స పొందుతూ మహిళ ఆస్పత్రిలో మృతిచెందింది. తెల్లవారుజామున దాదాపు 40 ఏళ్ల వయసున్న ఒక మహిళ, మరో యువకుడు రైల్వే స్టేషన్‌లో గొడవ పడడం చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే ఈ సంఘటన జరిగింది. సాక్షులు చెప్పిన ఆధారాల మేరకు పోలీసులు నిందితుడి వూహాచిత్రం గీయించి అతనికోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *