200 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు

 

 

 

 

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను శంకుస్థాపన,ప్రారంభోత్సవలు చేసిన
– శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్

-అభివృద్ధి చేసింది మేమే ఓటు అడిగే హక్కు మాకే ఉంది

డోర్నకల్/ కురవి, జులై/10/జనం సాక్షి న్యూస్ : డోర్నకల్ నియోజకవర్గం లో 200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తానని శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. సోమవారం కురవి మండలంలోని సుధనపల్లి, బంజారా తండా,లచ్చ తండా,కందికొండ,మాలోత్ తండా,జాటోత్ తండా,బొడ తండా,భూక్య తండా, కొత్తూరు (సి) గ్రామాలలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని,కందికొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర కు భక్తులు వెళ్లడానికి మూడు కోట్ల వ్యయంతో తారు రోడ్డు త్వరలో నిర్మిస్తామని ఆయన అన్నారు. తండాలను,గూడాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఆయన అన్నారు. ప్రతి గ్రామాలలో మూడు లక్షల అయంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నెల రోజుల్లో ఇస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్. గ్రామ గ్రామాలను అభివృద్ధి చేస్తున్న ఘనత బిఆర్ఎస్ పార్టీ దే అని కాబట్టి గ్రామాలలో ఓటు అడిగే హక్కు మాకే ఉందని ఆయన అన్నారు. మరోసారి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, రాజకీయాల్లో వచ్చింది సంపాదన కోసం కాదు ప్రజల సేవ చేయడానికి అని అన్నారు. నేను చేసే ప్రజాసేవాళ్లను గుర్తించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్, మండల అధ్యక్షుడు తోట లాలయ్య, జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య, సొసైటీ చైర్మన్లు, కొండపల్లి శ్రీదేవి,గార్లపాటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, బిఆర్ఎస్ యువ నాయకులు గూగులోత్ రవి నాయక్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, వివిధ గ్రామాల సర్పంచులు వడ్డూరి పద్మ, యానాల గంగాధర్ రెడ్డి, ఎంపీటీసీ బోజ్యా నాయక్,ఎంపీటీసీలు,గ్రామాల అధ్యక్షులు సురేష్, మాలోత్ ధన్సింగ్, బిఆర్ఎస్ నాయకులు వడ్డూరి మహేష్, మల్సూర్, భరద్వాజ్ రెడ్డి,టీచర్ సైదులు, రాము, మండల ప్రజా ప్రతినిధులు అధికారులు, అనుబంధ సంఘాల నాయకులు,పార్టీ కార్యకర్తలు నాయకులు భూక్యా సరియ్య, పేర్ల గణేష్, మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్, బానోత్ గణేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు