Friday, 6 November 2026

July 2012

వార్తలు

బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకోనున్న జగన్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జగన్‌ తరపు న్యాయవాది సుప్రీం అనుమతిని కోరనున్నారు.

కరీంనగర్

విమలక్క అరెస్టు

సిరిసిల్ల టౌన్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్షను అడ్డుకోవటానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రజాఫ్రంట్‌ చైర్మన్‌ విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ అడుగుపెట్టారాదని వారు నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిపై లాఠీ చార్జి…

వార్తలు

దుడ్డెడలో రాస్తారోకో

దుడ్డెడ: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు నిరసనగా మెదక్‌ జిల్లా దుడ్డెడ వద్ద రహదారిపై తెరాస కార్యకర్తల రాస్తారోకో నిర్వహించారు. మరికాసేపట్లో విజయమ్మ కాన్వాయ్‌ ఈ ప్రాంతానికి చేరుకోనుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను…

కరీంనగర్

సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్‌

సిరిసిల్ల: వైఎస్‌ విజమయ్మ పర్యటనకు నిరసనగా సిరిసిల్లలో తెరాస ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో వాణిజ్యసంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పట్టణంలోని తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అనేకమంది తెరాస…

హైదరాబాద్

విజయమ్మ రాజకీయయాత్ర :జూపల్లి

హైదరాబాద్‌: సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో దీక్ష పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయ తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌నేత , కొల్లాపూర్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో చొరబడి విద్యార్థులను, కార్యకర్తలను…

వార్తలు

భారతీయ జాలర్లను పట్టుకున్న శ్రీలంక

రామేశ్వరం: భారతీయ జాలర్లపై శ్రీలంక నావికాదళం ఆగడాలు కొనసాగుతున్నాయి. రామేశ్వరం సమీపంలో చేపల వేట సాగిస్తున్న 25 మంది తమిళజాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టుచేసింది. వీరికి సంబంధించిన ఐదు  పడవలను శ్రీలంక స్వాధీనం చేసుకుంది.

హైదరాబాద్

తెరాస ప్రధానకార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: తెరాస కార్యాలయంలోకి రానీయకుండా ఆ పార్టీ కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు విసిరారు.

హైదరాబాద్

బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌తో జగర్‌ మిలాఖత్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కోసమే జగన్‌ కాంగ్రెస్‌తో సన్నిహితమయ్యారని ఓయూ జేఏసీ ఆరోపించింది. సీమాంధ్రలోని చేనేత ప్రాంతాల్లో ధర్నలు చేయకుండా విజయమ్మ సిరిసిల్లకు రావడంలో అంతర్యమేంటని విద్యార్థి నేతలు ప్రశ్నించారు.

వార్తలు

సిద్దిపేటలో కొనసాగుతున్న అరెస్టులు

సిద్దిపేట: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.