Wednesday, 4 November 2026

August 2012

వార్తలు

బొగ్గు గనుల్లో వరద నీరు చేరి 8 మంది మృతి

చైనా: చైనాలోని హంగ్‌టాంగ్‌లో బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు. జిందా కోల్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కార్మికులు విధుల్లో ఉండగా బుధవారం నాడు వరద నీరు చేరడంతో వారు…

హైదరాబాద్

ఏసీబీ ముందు హాజరైన గాలి సోదరుడు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి ఏసీబీ ముందు హాజరయ్యారు. గాలి బెయిల్‌ వ్యవహారానికి సంబంధించి వరసగా  రెండో రోజు ఏసీబీ ఆయనను విచారిస్తోంది.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో నేడు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,520. కిలో…

వార్తలు

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా-గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్‌ తీరానికి ఆనుకుని స్థిరంగా…

వార్తలు

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 28 మాత్రమే

తిరుమల: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య 28 మాత్రమే అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం ఈరోజు తిరుమల వచ్చిన ఆయన  ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం…

వార్తలు

బైరెడ్డి మేలుకొలుపు దీక్ష ప్రారంభం

కర్నూలు: తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ మేలుకొలుపు దీక్ష ప్రారంభించారు. కృష్ణదేవరాయల విగ్రహానికి పాలతో అభిషేకం చేసి ఆయన మేలు కొలువు దీక్షను ప్రారంభించారు.

వార్తలు

అంగారక గ్రహంపై కొత్త ప్రయోగాలకు నాసా సిద్ధం

న్యూయార్క్‌: అంగారక గ్రహంపై కొత్త ప్రయోగాలకు ‘నాసా’ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 6న ‘ క్యూరియాసిటీ మార్స్‌ రోవర్‌ ‘ అంతరిక్షంలోకి పంపనుంది. ఇది విజయవంతమైతే అంగారక గ్రహంపై ప్రయోగాలకు మరో అడుగు మందుకు పడినట్లే.

వార్తలు

విజయవాడలో యువకుడి ఆత్మహత్య

విజయవాడ: విజయవాడ వాంబే కాలనీలోని బచ్చల నరేష్‌ (25) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కల్లూరికు చెందిన  దుర్గాభవానితో ఇతనికి ఆరు నెలల క్రితం వివాహమైంది. రెండు వారాల క్రితం శ్రావణ శుక్రవారం ఎవరూ…

వార్తలు

వివాదాస్పదస్థితిలో ఒలింపిక్స్‌ నుంచి వికాస్‌ కృష్ణన్‌ నిష్క్రమణ

లండన్‌: బాక్సింగ్‌ విభాగంలో తలపడుతున్న భారత  క్రీడాకారుడు వికాస్‌కృష్ణన్‌ ప్రీ క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరుకున్న  ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రత్యర్థి టీమ్‌ ఫిర్యాదుతో అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌ ఫలితాలను     పున:సమీక్షించి అమెరికన్‌కు అనుకూలంగా ఫలితాలను…

వార్తలు

మంగళగిరి రాజగోపురం పటిష్టత పరీక్షిస్తున్న ఐఐటీ బృందం

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి తూర్పు రాజగోపురం పటిష్ఠతను చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణుల బృందం పరీక్షస్తొంది. రాజగోపురం మనుగడపై గత రెండేళ్లుగా సందేహాలు వ్యక్తం కావడంతో  పునాదుల స్థాయి నుంచి పటిష్టతను  పరీక్షించడానికి ముగ్గురు…