Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

యువక్రికెటర్లకు ఘనస్వాగతం

ముంబయి: అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు ఈ రోజు మధ్యాహ్నం భారత్‌ చేరుకుంది. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న యువత జట్టు సభ్యులను చూడగానే హర్షధ్వానాలు చేసింది.

జిల్లా వార్తలు

మద్దూరు మండలంలో గ్రామ సభలు

నిజామాబాద్‌: మద్దూరు మండలంలోని అండేకేలూర్‌,చిన్నశక్కర్‌దా,బోజేగాం, తడి ఇప్పర్‌దా,రూసేగాం,లుంబూర్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ, అంగన్‌వాడి వైద్యసిబ్బంది గ్రామ కార్యదర్శులు పారిశుద్యం, తాగునీటి సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా వార్తలు

నారెగూడ గ్రామంలో అనుమానాస్పద మృతి

రంగారెడ్డి: నవాబుపేట మండలంలోని నారెగూడ గ్రామంలో వడ్ల అంజనేయిలు(28) నిన్న ఇంటినుంచి వెళ్లిన అతను పొలంలో శవమై కన్పించాడు. అతని మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు.

జిల్లా వార్తలు

అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య

రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.

హైదరాబాద్

అసెంబ్లీలోని భవనంపైకి ఎక్కి నిరసనలు

హైదరాబాద్‌: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టకుండా తమను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఆమెకు నచ్చజెప్పడంతో కొదిసేపు నిరసన…

వార్తలు

నదిలో జీపు బోల్తా…16 మంది గల్లంతు

రాంచీ: జార్ఖండ్‌లోని ఉత్తర కోయల్‌ నదిలో ఓ జీపుఉ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఖమ్మం

నకిలి ఎరువుల లారీని పట్టుకున్న గ్రామస్తులు-పోలీసులకు అప్పగింత

ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి మట్టితో కలిపారని తెలిపారు.

కరీంనగర్

కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల నిరసన

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కార్యలయం ముందు కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు మోహన్‌ ఆధర్యంలో ఈ నిరసన చేపట్టారు.

హైదరాబాద్

మంత్రి దానం కుడిచేతికి గాయం

హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ కుడిచేతికి గాయమైంది. ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసి కుట్లు వేశారు. చికిత్స కోసం ఉదయం నుంచి రెండు సార్లు మంత్రి ఆసుపత్రికి వచ్చారు. అయితే మంత్రి గాయానికి…