Thursday, 5 November 2026

August 2012

ఎడిట్ పేజీ

కూర్చుంటే కుదరదు కవాతు చేయాల్సిందే…!

తెలంగాణ నాలుగున్నర కోట్ల ఆశ…శ్వాస..తెలంగాణ ఓ బతుకు పోరాటం…ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు.. పోరాడాల్సిన సమయం..పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న సూక్తే మనకు ఆదర్శం…తెగించి  కదన రంగంలో దూకి తెలంగాణకై పోరాడాలి..తెలంగాణ వాసులకు పోరాటాలు…

వార్తలు

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా.

వార్తలు

2జీ స్ప్రెక్ట్రం కేసులో చిదంబరంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేసిన సుఫ్రీం

ఢిల్లీ: 2జీ స్ప్రెక్ట్రం కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌నేత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంపై సుబ్రమణ్యసామి సుఫ్రింలో పిటిషన్‌ దాఖలు చేశాడు. 2జీ కేసులో చిదంబరం పాత్ర ఉందని ఆరోసిస్తూ సుఫ్రింలో వేసిన పిటిషన్‌ను సుఫ్రింకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

వార్తలు

వాయిలార్‌ రవితో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. తాజారాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే బోత్సను పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారన్న ఊహగానాలు…

వార్తలు

ఒడిషాలో ఆటోను ఢీకొన్న రైలు-8మంది దుర్మరణం

ఒడిషా: సంబల్‌పూర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాపింగ్‌ దాటుతున్న ఆటోను రూర్కెల భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి…

హైదరాబాద్

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

హైదరాబాద్‌: ప్రైవేటు ట్రావెల్స్‌పై నగర శివార్లలో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 5 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

అల్లుడిపై అత్తామామ దాడి

హైదరాబాద్‌: అల్లుడిపై అత్తామామ దాడి చేసిన ఘటన నాదర్‌గుల్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

ఎంజీఎంలో మరో శిశువు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశువుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో 3 రోజుల పసికందు శుక్రవారం ఉదయం మృతి చెందింది, రెండు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోవడవంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్

నేడు విద్యుత్‌ సౌధను ముట్టడించనున్న బీజేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధ ముట్టడి కార్యక్రమం ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు.

వార్తలు

నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యియి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.