Friday, 6 November 2026

September 2012

ఆదిలాబాద్

శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలి

దిలావర్‌పూర్‌ : గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్‌ సీఐ రఘు సూచించారు ఈ రోజు దిలావర్‌పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల గణేశ్‌ మండపాల నిర్వాహాకులతో ఆయన ఎంపీడీఓ కార్యాలయాల్లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు…

హైదరాబాద్

స్పీకర్‌ను కలిసిన భాజపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, కిషన్‌రెడ్డిలు ఈ రోజు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు స్పీకర్‌ను కోరారు.

వార్తలు

కురుపాం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో సుప్రీం స్టే

ఢిల్లీ: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్‌ ఎన్నిక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే సభకు హాజరు కావచ్చు కానీ ఓటింగ్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్లో  పేర్కొంది.

హైదరాబాద్

‘బిల్డ్‌ ఫర్‌ ఇండియా-2012’ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్‌:ప్రభుత్వ పారిశ్రమిక విధానం అమలు వల్లే మౌలిక వసతులు, నిర్మాణ రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు శీనయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం వృద్ధికి చాలా అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో…

హైదరాబాద్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి దామోదరి రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ రోజు ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించిన రాజనర్సింహ అనంతరం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం…

వార్తలు

కేంద్ర హోంమంత్రిని కలిసిన తెరాస నేతలు

ఢిల్లీ: తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌లు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయ్యారు. చిన్న రాష్ట్రాల వల్ల నక్సల్స్‌ సమస్య పెరుగుతుందన్న హోంమంత్రి వ్యాఖ్యాలపై ఆయనకు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

వార్తలు

కానిస్టేబుల్‌ తుపాకీ చోరీ

కర్నూలు:ఏపీఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ ఆనంద్‌ తుపాకీ చోరీకి గురయ్యింది. ఈ మేరకు ఆయన యూపీలోని ఝాన్సీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీభవన్‌ బందోబస్తుకు వెళ్లివస్తుండగా  ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తుపాకీ చోరీకి గురైనట్లు ఆయన తెలియజేశారు.

వార్తలు

నలుగురి అరెస్టు: రూ.21 లక్షల సొత్తు స్వాధీనం

కాకినాడ:ఉభయగోదావరి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 21 లక్షల విలువైన బంగారం, వెండి, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

హైదరాబాద్

ఆస్తుల వివరలు ప్రకటించిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన, కుటుంబ సభ్యుల ఆస్తుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన ప్రకటించారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నానని ఆయన తెలియజేశారు.  తాను  ఆస్తులు ప్రకటించిన తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో చలనం …

హైదరాబాద్

తెలంగాణ మార్చ్‌కు ప్రజాఫ్రంట్‌ మద్దతు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు మద్దతు ఇవ్వలాని కోరుతూ తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేతలను కలిశారు. ప్రజాఫ్రంట్‌ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు వేదకుమార్‌ను కలిసి తెలంగాణ మార్చ్‌కు సంఘీభావం తెలిపాలని…