Friday, 6 November 2026

September 2012

వార్తలు

తమ్మిలేరు జలాశయంనుంచి నీటి విడుదల

దెందులూరు: తమ్మిలేరు జలాశయంనుంచి బుధవారం 3,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంగళవారం 4,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇన్‌ఫ్లో తగ్గటంతో బుధవారం దిగువకు విడుదల చేసే నీటిని కూడా తగ్గించారు.

వార్తలు

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

హైదరాబాద్‌: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా నేతలు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడానికి చోటుచేసుకున్న పరిణామాల్ని పాఠ్యాంశంగా తీసుకురావాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ వమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించేందుకు…

వార్తలు

తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి రాజీవ్‌ గృహకల్ప కాలనీలో మద్యం మత్తులో తండ్రిని భవనంపైనుంచి తోసేసిన తనయుడు. తండ్రి బాలేసాహెబ్‌ను కొడుకు మౌలాలీ మూడో అంతస్థునుంచి కిందకు తేసేశాడు. మద్యం మత్తులో ఉన్న మౌలాలీ పెళ్లి చేయలేదన్న కోపంతో…

వార్తలు

ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖారారు

హైదరాబాద్‌: ఈ నెల 14న సాయంత్రం 6 గంటల తర్వాత ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఖరారు చేస్తామని ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రధానాధికారి రఘునాధ్‌ వెల్లడించారు. విద్యార్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్న అప్షన్లు, ప్రతిభ ఆధారంగా…

వార్తలు

బ్రిటన్‌ కోచ్‌ టీమ్‌ దక్కన్‌ ఛార్జర్స్‌ రైట్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ దక్కన్‌ ఛర్జర్స్‌ అమ్మకం కోసం బీసీసీఐ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్వవహారంపై హైకోర్టు జోక్యం చేసుకోజాలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌ టిమ్‌…

వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరీ పేట వద్ద గూడ్సురైలు పట్టాలు తప్పింది. దాంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వార్తలు

నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

నెల్లూరు: రెండురోజులుగా నెల్లూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జిలుగా జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, ఎమ్మెల్యేలు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకా నందరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్తలు

పైకప్పు పెచ్చులు పడి ఉపాధ్యాయురాలికి గాయాలు

కర్నూలు: జిల్లాలోని డోన్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించకున్నారు. తరగతిగదిలో పద్మజ అనే ఉపాధ్యాయురాలు బోధిస్తున్న సమయంలో తరగతి గది పైకప్పు పెచ్చులు వూడి ఆమెపై పడటంతో తలకు గాయమైంది.…

సీమాంధ్ర

27మంది కమ్యూనిటీ గార్డుల నియామకం

విశాఖపట్నం : నగర కమిషనరేట్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గార్డుల వ్వవస్థలో 27మందికి శిక్షణ ఇచ్చి నియమించినట్లు సీపీ పూర్ణ చంద్రరావు తెలిపారు. బుధవారం కమిషనరేటే సమావేశ మందిరంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

కరీంనగర్

రామడుగులో మలేరియాతో మహిళ మృతి

కరీంనగర్‌: రామడుగు మండల కేంద్రంలోని అమరగొండ ఉమ(45) మలేరియా జ్వరం సోకి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉమకు కరీంనగర్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యులు…