Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ 56.47 పాయింట్ల ఆధిక్యతో 17,440.87 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 20.25 పాయింట్ల లాభంతో 5,247 వద్ద ముగిశాయి. మార్కెట్‌ ప్రారంభంలో నష్టపోయినప్పటకీ చివరి రెండుగంటల్లో ట్రేడింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ లాభాల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా…

వార్తలు

ముంబయిలో కూలిన మెట్రో రైలు నిర్మాణం

ముంబయి: ముంబయి నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం అంధేరి, కుర్లా రహదారిలోని నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడంతో ఎనిమిదిమంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని సెవన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు షిండేను కోరారు. సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.

వార్తలు

సికింద్రాబాద్‌ విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌, విశాఖల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్యే తెలిపింది. ఇరోజు రాత్రి 10.30 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఉంటుంది. రేపు రాత్రి 9.30…

వార్తలు

కావేరి నది అధారిటీ సమావేశం

న్యూఢిల్లీ : తమిళనాడులోని పంటలను కాపాడేందుకు కావేరి జలాలివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. ఈ నెలాఖరులో కావేరి నది ఆధావిటీ సమావేశం ఏర్పాటుచేయునున్నట్టు కేంద్రం జలవనరుల శాఖమంత్రి పవన్‌కుమార్‌ జన్సల్‌ తెలిపారు.…

Featured News

మెట్రో వంతెన కూలి ఇద్దరికి గాయాలు

ముంబయి: నిర్మాణంలో ఉన్న మెట్రోవంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అంధేరి-కుర్లా రహదారిలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాలను సహాయ సిబ్బంది తొలగిస్తోంది.

కరీంనగర్

ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు

కరీంనగర్‌: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.

కరీంనగర్

కుండపోత వర్షానికి కోట్టుకుపోయిన కల్వర్టు

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.

కరీంనగర్

ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య

కరీంనగర్‌: వెల్గటూర్‌లో మంబలంలోని గుడిసెల పేటకు చెందిన కేశవ్‌(25)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కరీంనగర్

విద్యారంగా సమస్యల పరిష్కరించాలని రాస్తారోకో

కరీంనగర్‌: వెల్గటూర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.