Monday, 2 November 2026

September 2012

జిల్లా వార్తలు

మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట ధర్నా

మెదక్‌: మైనార్టీ హాస్టల్ల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరెట్‌ ఎదుట బీస విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

జిల్లా వార్తలు

రైతులకు పంట నష్ఠ పరిహారం అందిచాలని తహసీల్ధారుకు వినతి పత్రం

మెదక్: దుబ్బకలో రైతులకు పంట నష్టపరిహారం, బీమా సోమ్మును అందించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యలయంలో ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

జిల్లా వార్తలు

రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేవాసరు.

జిల్లా వార్తలు

చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో చికిత్స చేయించిన ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

హైదరాబాద్

ఇటలీ సదస్సుకు గృహనిర్మాణ సంస్థ ఎండీ

హైదరాబాద్‌: ఇటలీలో  జరిగే ప్రపంచ పట్టణ వేదిక అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ డి. వెంకటేశం పాల్గొంటున్నారు. రేపటినుంచి 5వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ‘ అందుబాటులో ఇళ్లు’ అనే అంశంపై వెంకటేశం…

వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

అనంతపురం: ఓఖా-ట్యుటికోరిస్‌ మధ్య  నడిచే వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ రైలు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద గంటనుంచి నిలిచిపోయింది. తాగునీరు కూడా లేదంటూ రైలు ప్రయాణీకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కరీంనగర్

వెంకటాపూర్‌లో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులో సీపీఐ తెలంగాణ ప్రజా పోరుయాత్ర సాగుతుంది. పోన్నం కేటీఆర్‌ పూలమాలలు వేసి నారాయణకు స్వాగతం పలికారు.

వార్తలు

సభలను అడ్డుకునే తీరతాం: భాజపా

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుని తీరతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ప్రధాని రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పింది. కేవలం బొగ్గు కుంభకోణం గురించి తాము ప్రధాని రాజీనామా కోరడం లేదని, వరసగా వెలుగులోకి వచ్చిన…

హైదరాబాద్

ఎస్పీవై రెడ్డి రాజీనామా ఉపసంహరణ

హైదరాబాద్‌: ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలిశయానికి నీరు చేరుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అర టీఎంసీ నీటిని…