Saturday, 7 November 2026

November 2012

జిల్లా వార్తలు

సీమాంధ్ర పార్టీలో తెలంగాణ సాధించలేం : హరీశ్వర్‌రెడ్డి

రంగారెడ్డి : సీమాంధ్ర పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేమని పరిగి ఎమ్మెల్యే  కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగం సభలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్వర్‌రావుతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు…

జాతీయం

అమితాబ్‌ బచ్చన్‌కు చేదు అనుభవం

  ముంబయి నవంబర్‌ 15,(జనంసాక్షి) శివ సేన చీఫ్‌ బాల్‌ధాక్రేసు ఆయన నివాసమైన మాతాశ్రీలో పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ హిందీరంగ చలనచిత్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు చేదు అనుభవం ఎదురైంది ఆయన నివాసం వద్ద చేరిన పలువురు అభిమానులను…

జిల్లా వార్తలు

రెండు రాజ్యాలే తెలంగాణను ముంచినయి : కేసీఆర్‌

రంగారెడ్డి: రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం రెండూ తెలంగాణను నిలుపునా ముంచాయని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆయన విమర్శించారు. ఇవాళ ఆయన పరిగిలో…

వార్తలు

భారత్‌ 323/4

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ టెస్ట్‌లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. శతకం నమోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ 117 పరుగుల వద్ద ఔట్‌ అవగా పుజారా 98, గంభీర్‌ 45,…

ఖమ్మం

రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికివేసిన మావోయిస్టులు

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక-ఎదిర మధ్య మావోయిస్టులు రోడ్డుకు అడ్డంగా చెట్టను నరికివేశారు. ఇవాళ, రేపు బంద్‌కు మద్దతివ్వాలని వారు గోడపత్రికలు అంటించారు.

హైదరాబాద్

ఎంఐఎంపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: ఎంఐఎంపై పాతబస్తీ కాంగ్రెస్‌ నాయకులు మానవ హక్కుల కమిఫన్‌కు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ ఉద్రిక్తతలకు  ఎంఐఎం కారణమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మకు హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

వార్తలు

శ్రీలంక సైన్యంలో తమిళ వనితల నియామకం

కొలంబొ: ఇప్పటివరకు కేవలం సింహళీయులే ఉన్న శ్రీలంక సైన్యంలో ఇక తమిళులకూ చోటు లభించనుంది. వచ్చే శనివారం కిలినోచ్చిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో 18-22 ఏళ్ల మధ్య వయస్సు తమిళ యువతులు వందమందిని సైన్యంలో శిక్షణకు ఎంపిక…

హైదరాబాద్

నయీంను ప్రభుత్వ పెద్దలే పెంచి పోషిస్తున్నారు : కోనపురి రాములు

హైదరాబాద్‌: తన సోదరుడు సాంబశివుడిని హత్య చేసినట్లే తనకూ ప్రాణ హాని ఉందని మాజీ మావోయిస్టు కోనపురి రాములు ఆందోన వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా అపరిచిత వ్యక్తులు తనకు ఫోన్‌ చేసి హత్య చేస్తామని హెచ్చరిస్తున్నారని …

హైదరాబాద్

మజ్లిస్‌ నిర్ణయాన్ని ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారు : శైలజానాథ్‌

హైదరాబాద్‌: కొత్త మిత్రులను వెదుక్కొన్న మజ్లిన్‌ నేతలు కాంగ్రెస్‌ను నిందించడం తగదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. కాంగ్రెస్‌ మతతత్వ శక్తులతో చేతులు కలిపిందనే మజ్లిన్‌ నిర్ణయాన్ని ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. మజ్లిన్‌…