November 2012
ప్రణబ్ ముఖర్జీతో ఖలీదా జియా భేటీ
ఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి భేగం ఖలీదా జియా శనివారం నాడిక్కడ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలుసుకున్నారు. ఇరుగుపొరుగైన బంగ్లాదేశ్‌తో చక్కటి సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రణబ్‌ముఖర్జీ ఈ సందర్భంగా ఆమెకు చెప్పారు. పరస్పర…
వరదనీటిలో చిక్కుకుపోయిన రైతులు
విశాఖ: భారీ వర్షాలకు విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది.వద్ద వరదనీటిలో 21 మంది రైతులు చిక్కున్నారు.
ఉద్థృతంగా శారదా నది
విశాఖ: జిల్లాలో భారీ వర్షాలకు శారదా నది ఉద్థృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజువాక-ఎలమంచిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు
కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముసాపేటకు చెందిన విష్ణు గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఈ రోజు పట్టుకున్నారు. శేరిలింగంపల్లికి…
త్వరలో నెంబర్‌వన్ స్థానం అందుకుంటా : సెరీనా
జొహన్నెస్‌బర్గ్: త్వరలో నెంబర్‌వన్ స్థానం అందుకుంటానని టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తన సోదరి వీనన్‌తో కలిసి జొహన్నెస్‌బర్గ్ వచ్చిన సెరీనా మాట్లాడుతూ ఈ సంవత్సరం తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.…
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం: కోట్ల
హైదరాబాద్: ఇప్పటి వరకు రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి అన్నారు. వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి న్యాం చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌పార్టీని ఎవరూ వాడరని ఆయన అన్నారు.
మావోయిస్టులపై 15 హెలికాఫ్టర్లతో కార్యాచరణ: డీజీపీ
విశాఖ: ఏవోబీ మావోయిస్టుల కార్యకలాపాల నివారణకు 15 హెలికాఫ్టర్లతో కార్యాచరణ సిద్దం చేసినట్లు డీజీపీ తెలిపారు. మరో 3,4 నెలల్లో కార్యాచరణకు మానవరహిత విమానం వినియోగిస్తామన్నారు. రాజమండ్రి కేంద్రంగా మానవరహిత విమానం పనిచేస్తుందన్నారు. గ్రెహౌండ్స్, ప్రత్యేక దళాలు, ఒరిస్సా…
గుడివాడ – హనుమాన్‌జంక్షన్‌ల మధ్య రాకపోకలు బంద్
గుడివాడ: నందివాడ మండలం పుట్టుగుంట వద్ద బుడమేరు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో గుడివాడ -హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పేదప్రజలకు ‘హృదయ స్పందన’
కరీంనగర్, నవంబర్ 3: పేద కుంటుంబాల పిల్లలకు గుండె ఆపరేషన్, ఇతర ప్రాణాత్మకమైన వ్యాధుల నుండి రక్షించుటకు ఏర్పాటు చేసిన ‘హృదయ స్పందన’ కార్యక్రమానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ సిబ్బంది ఒక రోజు జీతం 17,868 రూపాయలు…

