Friday, 6 November 2026

December 2012

జాతీయం

కాంగ్రెస్‌ బలపడింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలు వస్తాయన్న భాజపాకు తక్కువ సీట్లు రావడం ఇందుకు తార్కాణమన్నారు.

హైదరాబాద్

నాలుగోరోజుకు చేరుకున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలోని మానస సరోవర్‌ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు నేటితో నాలుగోరోజుకు చేరుకున్నాయి. సద్గురు మంగేష్ఠ క్రియ యోగ గురువారం సభలో పాల్గొని ప్రసంగించారు. యోగ, ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వివేచనశక్తిని అభివృద్ధి…

సీమాంధ్ర

నాటు తుపాకీతో కాల్చుకుని ఇద్దరి మృతి

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకి కాల్చుకుని ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శివమ్మలు మృతిచెందారు. తమ అక్రమ సంబంధం భర్తకు…

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో రెండోరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడుల కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారమే వాదనలు విన్న…

జాతీయం

75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

జాతీయం

పాలనకు పట్టం కట్టారు : నరేంద్రమోడీ

గాంధీనగర్‌ : గుజరాత్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రజలు తిరిగి పట్టం కట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిండంపై ఆయన  .

జాతీయం

మోడీ విజయంపై స్పందించని నితీష్‌

పాట్నా : గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ విజయంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎన్డీయే అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న భాజపాలోని కొందరి ప్రతిపాదనలపై జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్

ప్రధాని అభ్యర్థిగా మోడీ అర్హుడు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ అర్హుడని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ గుజరాత్‌ ప్రజలు మోడీకి అండగా నిలిచారని అన్నారు.

జాతీయం

భాజపాకు సీట్ల సంఖ్య తగ్గింది : చిదంబరం

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్ల సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖమంత్రి చిదంబరం అన్నారు. గతంలో ఆ పార్టీకి 117 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య తగ్గనుందని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్

సామాన్యులకు అభివృద్ధిఫలాలు చేరాయి : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : గుజరాత్‌లో మోడీ నాయకత్వంలోని భాజపా పాలనలో అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరాయని భాజపా నేత బండారు దత్తాత్రేయ అన్నారు. దీంతో ప్రజలు తిరిగి భాజపాకు పట్టం కట్టారని పేర్కొన్నారు.