Thursday, 5 November 2026

January 2013

సీమాంధ్ర

చట్టపరంగానే వ్యవహరిస్తున్నాం : సీబీఐ జేడీ

అనంతపురం : అక్రమాస్తుల కేసులో నిందితులపై చట్టపరంగానే వ్యవహరిస్తున్నామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గనుల అక్రమ వ్యవహారంలో విదేశాల్లో లావాదేవీలపై సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.

వార్తలు

రెండో రోజు మేథోమథన సదస్సు ప్రారంభం

జైపూర్‌: 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా జరగుతున్న కాంగ్రెస్‌ మేదోమథన సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. మథ్యాహ్నం వరకూ పలు అంశాలపై చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు. అనంతరం పార్టీ అధినేత జైపూర్‌ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు.

వార్తలు

వేధింపులు తాళలేక ఇద్దరు మహిళల బలవన్మరణం

అడ్డాకుల : మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలోని సంకలమద్ది గ్రామం బంగ్లాగడ్డ కాలనీలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే.. మణమ్మ (18) అనే మహిళ భర్త పెట్టే వేధింపులను తాళలేక ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో రాకపోకల పునరుద్ధరణ

హైదరాబాద్‌: పొగ మంచు కమ్ముకోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలిచిన విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం రన్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ , జైపూర్‌, అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను చెనైకి మళ్లించారు. అయితే…

సీమాంధ్ర

కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

నెల్లూరు : కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం వూట్లపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారిన్ని బంధువులు ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

లారీ బోల్తా :12 మందికి తీవ్ర గాయాలు

కడప : సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల బస్టాండ్‌ వద్ద బాతులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

ముంబయిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ముంబయి : నాలుగేళ్ల చిన్నారు పాఠశాల బస్సులో అత్యాచారానికి గురైన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం చిన్నారి పాఠశాల బస్సులో ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో చిన్నారి తప్ప  బస్సులో ఇంకా ఎవరూ…

జిల్లా వార్తలు

విద్యుత్‌ ఉప కేంద్రం ముట్టడి

నిజామాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ  నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలపాటు సరఫరాను…

హైదరాబాద్

46వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 46వ రోజుకు చేరుకుంది. పల్లెలన్నీ ఉద్యమక్షేత్రాలు అయ్యాయి. వీధులన్ని జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్నాయి. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పల్లెబాటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారగా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ప్రజల…

హైదరాబాద్

రేపు తెలంగాణ సాహిత్య యుద్ధభేరి సభ

హైదరాబాద్‌: ఈ నెల 20న (ఆదివారం) హైదరాబాద్‌ దోమలగూడ ఏవీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సాహిత్య యుద్ధ భేరి సభ నిర్వహించననున్నట్లు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన వేదిక ప్రతినిధులు జూపాక…