Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

వాయిదా అనంతరం శాసనసభ ప్రారంభం

హైదరాబాద్‌ : గంట పాటు వాయిదా పడిన శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైన అనంతరం విపక్షాలు ఆందోళనకు దిగాయి. అక్రమ అరెస్టులపై చర్చ చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు, తాగునీటి సమస్యపై చర్చించాలని టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు.…

జాతీయం

ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు

న్యూఢిల్లీ:దేశరాజధాని ఢిల్లీకి ఉ్నగవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఆరెస్టు చేశారు. దీంతో పోలీసులు ఢిల్లీ ఉగ్రవాద దాడి ప్రయత్నాలను నిరోధించినట్లు భావిస్తున్నారు. పోలీసులు…

జిల్లా వార్తలు

ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్‌-విజయవాడ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వార్తలు

ఎదురు కాల్పుల్లో 5గురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌ : ఒడిశా-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులోని షోడీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్ట్‌లక మధ్య భారీ ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో అయిదుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

కరీంనగర్

ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థునులకు అస్వస్థత

కరీంనగర్‌ : ఓదెల కస్తూర్బి పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సీమాంధ్ర

రూ. 10 లక్షల ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు : నెల్లూరు జిల్లా రాపూరు. పెళ్లకూరు గ్రమాల్లో అటవీ శాఖ అధికారులు సోదాలు సోదాలే జరిపారు. ఈ సోదాల్లో రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు…

జాతీయం

లోక్‌సభ గంటపాటు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సడక్‌బంద్‌లో పోలీసుల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడంతో సభాపతి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు.

హైదరాబాద్

తెరాస ఎమ్మెల్యేలకు చర్చలకు ఆహ్వానం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెరాస ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు.శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో తెరాస శాసనసభ్యులు సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణవాదులపై కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

హైదరాబాద్

సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేల బైఠాయింపు

హైదరాబాద్‌ : శాసనసభ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించారు. తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క స్పీకర్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు సభ సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్

శాసనమండలి 20 నిమిషాలు వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనతో శాసనమండలి 20 నిమిషాలు వాయిదా పడింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి రద్దు చేయాలంటూ మండలిలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ మండలిని…