Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

బెల్లంపల్లిలో ప్రజాఫ్రంట్‌ నేతల అరెస్టు

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రజాఫ్రంట్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లికి తరలించారు.…

తెలంగాణ

నేడు సిక్కోలు పర్యటించనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం ఇందిరమ్మ కలల కార్యక్రమాల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

సీమాంధ్ర

తిరుమలలో ప్రసాదాల నిలిపివేత

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో నిత్య అన్నదాన సత్రంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ మధ్యాహ్న వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రసాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని తెలుస్తుంది.

సీమాంధ్ర

తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటలు సమయం పడుతోంది.

ఎడిట్ పేజీ

లౌకికశక్తుల ఏకీకరణ దిశగా జేడీయూ

జనతాదళ్‌ (యునైటెడ్‌) కేంద్రంలో లౌకికశక్తుల ఏకీకరణకు కంకణం కట్టుకుంది. ఆ దిశగానే కొన్నాళ్లుగా అడుగులు ముందుకు వేస్తోంది. నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ)లో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జేడీయూ. 15వ లోక్‌సభలో ఎంపీల సంఖ్య రిత్యా…

సీమాంధ్ర

చింతల్‌నార్‌కు సమీపంలోనే ఎదురాకాల్పులు

ఖమ్మం : గతంలో మావోయిస్టులు జవాన్ల వూచకోతకు పాల్పడిన ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం చింతల్‌నార్‌కు సమీపంలోనే ఈ ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి…

అంతర్జాతీయం

సుందర్‌లాల్‌ బహుగుణకు అస్వస్థత!

డెహ్రాడూన్‌ : చిప్కో ఉద్యమ నిర్మాత, ప్రముఖ పర్యావరణవేత్త సుందర్‌లాల్‌ బహుగుణ(86) శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరికొంత కాలం ఆయన ఆసుపత్రిలో ఉండాల్సి…

జిల్లా వార్తలు

ప్రాణం తిసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌

దౌల్తాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్లాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జీంగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జీంగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా లభంతో కొనసాగుతోంది.

వార్తలు

తిరుమలలో అగ్ని ప్రమాదం

రంగంలోకి దిగిన ఆక్టోపస్‌ బృందం తిరుమల : తిరుమలలోని అన్నదాన సత్రం గోదాంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లలేకపోతున్నారు. దీంతో ఆక్టోపస్‌ దళాలు…