Thursday, 5 November 2026

April 2013

వార్తలు

నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

చెన్నై : అరక్కోణం వద్ద యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి బెంగళూర్‌ వెళ్లే బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే…

జాతీయం

నేటి నుండి షిండే పర్యటన

న్యూడిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై రష్యా మంత్రులతో ఆయన చర్చించనున్నారు.

సీమాంధ్ర

రైస్‌మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

జంగారెడ్డిగూడెం గ్రామీణం : పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామంలోని రైస్‌మిల్లులో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మిల్లులోని యంత్రాలు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

కృష్ణా : రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్‌ ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 76 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్టకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

బెంగళూరు, జనంసాక్షి:  ఐపీఎల్‌-6 లో భాగంగా చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నది.  

జిల్లా వార్తలు

కలెక్టర్‌ భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులో పాల్గన్నారు.

శివంపేట: శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో సబ్‌ కలెక్టర్‌ భారతి పాల్గొన్నారు. భూసమస్యలు పరిష్కరించుకోటానికి రెవెన్యూ సదస్సులను సద్వియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

తెలంగాణ

బంద్‌ తర్వాత … బస్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ : విపక్షాల రాష్ట్ర బంద్‌ అనంతరం మంగళవారం సాయంత్రం ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి జిల్లాలకుఏ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. మహత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ జూబిలీ బస్‌ స్టేషన్‌ లనుంచి జిల్లాలకు బస్సులు బయలుదేరాయి.

సీమాంధ్ర

తిరుపతిలో ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు

తిరుపతి : తిరుపతిలో పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షల విలువై 32 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

మండుతున్న ఎండలు : రాయలసీమలో 43 డిగ్రీల

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. రాయలసీమలో ఈరోజు  43 డిగ్రీల గరిష్ఠ ఉస్ణోగ్రత నమోదు కాగా, కోస్తాంధ్ర…