Thursday, 5 November 2026

April 2013

జాతీయం

నేటి నుంచి రష్యాలో షిండే పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నేటి నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై రష్యా మంత్రులతో ఆయన చర్చించనున్నారు.

తెలంగాణ

ప్రేమ జంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

సాగర్‌ హైవేపై విషాదం: బాలిక మృతి

రంగారెడ్డి,  జనంసాక్షి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని సాగర్‌ హైవేపై విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తల్లీకూతుళ్లపైకి డీసీఎం వ్యాను దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి గాయపడగా నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.…

తెలంగాణ

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్‌ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

తెలంగాణ

మే 31న డైట్‌ సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ ‘డీఎడ్‌ 2013’ నోటిఫికేషన్‌ జారీ అయింది. 2013-15 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మే 31న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డైట్‌ సెట్‌ కమిటీ చైర్మన్‌ వీ ఉషారాణి తెలిపారు. ప్రవేశ రాత…

కరీంనగర్

సత్ఫలితాల సాధనకు కృషి చేయాలి

తిమ్మాపూర్‌, ఏప్రిల్‌ 10 (జనం సాక్షి): ఎంసెట్‌లో మంచి ఫలితాల సాధించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ పేర్కొన్నారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ గ్రామశివారులోని సాంఘిక సంక్షేమ…

తెలంగాణ

నేటి నుంచి ఆదివాసీల సాంస్కృతిక సమ్మేళనం

ఖమ్మం.జనంసాక్షి:  ఖమ్మం జిల్లా చింతూరులో బుధవారం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌, ఎడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది ఆదివాసీలు తరలిరానున్నారు. వివిధ రాష్ట్రాలకు…

జిల్లా వార్తలు

చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది

తాండూరు పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడానికి ప్రయత్నించగా తెదేపా, తెరాస నాయకులు అడ్డుకున్నారు. రెండు పార్టీల నాయకుల అభ్యంతరంతో అధికారులు బస్సులను నిలిపివేశారు. బస్సులు…

జిల్లా వార్తలు

తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ బిందెలతో రాస్తారోకో

ధన్వాడ: తాగునీటి సమస్య పరిష్కరించాలని చిన్నగరపల్లి గ్రామస్థులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని బోర్లన్నీ వట్టిపోయాయని… తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ…

అంతర్జాతీయం

చైనా వ్యాఖ్యాలను స్వాగతించిన అమెరికా

వాషింగ్టన్‌ : ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గించడానికి చైనా చేపడుతున్న చర్యలను అమెరికా స్వాగతించింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే విధానాలను ఖండిస్తూ చైనా చేసిన వ్యాఖ్యాలను స్వాగతిస్తున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జే కార్నే…