Wednesday, 4 November 2026

April 2013

మహబూబ్ నగర్

జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థుతకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.

సీమాంధ్ర

ముళ్లపొదల్లో ఆడశిశువు

దేవరపల్లి, జనంసాక్షి: విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొలిగొట్టలో శారదానది సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. గ్రామంలోని ఓ కుటుంబం ఆ శిశువును అక్కున చేర్చుకుంది.

జాతీయం

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి కారణంగా 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.…

ఖమ్మం

జేసీబీ జప్తు

అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్‌ వెంగారెడ్డి తెలిపారు.

హైదరాబాద్

కరెంట్‌ సత్యాగ్రహానికి ప్రజలు మద్దతు

హైదరాబాద్‌ : పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతు పెరుగుతోంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని రెంట్‌ సత్యాగ్రహ ప్రాంగణానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. విజయమ్మకు సంఘీభావం తెలుపుతున్నారు. అశేషంగా…

జాతీయం

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 173 పాయింట్లు, నిప్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

హైదరాబాద్

‘భారం తగ్గించేవరకూ దీక్ష విరమించేదిలేదు’

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలపై మోపిన రూ.6,500 కోట్ల రూపాయలు భారం తగ్గించేవరకు నిరవధిక దీక్ష ఆపేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని పోదాటాలు…

జాతీయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుమతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 8 కంపార్టమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది.

జిల్లా వార్తలు

మెస్‌ల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న ఆందోళన

వరంగల్‌ : కాకతీయ యూనివర్షిటీలో మెస్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన రెండు రోజుకు చేరుకుంది. ఈ ఉదయం విద్యార్థులు అల్పాహారం బంద్‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. పరిశోదక విద్యార్థులు యూనివర్షిటీని బంద్‌…

మెదక్

మెదక్‌ జిల్లాలో మహిళపై ఆత్యాచారం

మెదక్‌ : జిల్లాలోని కొండపాక మందలం మాటుపల్లి గ్రామంలో బుధవారం ఆర్థరాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అర్థరాత్రి సిద్ధిపేట నుంచి వస్తూ మాటుపల్లి స్టేజి వద్ద దిగి తన ఇంటికి నడిచి వేళ్తున్న ఓ వివహిత (24)ను…