Wednesday, 4 November 2026

April 2013

సీమాంధ్ర

11న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, జనంసాక్షి: శ్రీవారి ఆలయంలో ఈనెల 11న ఉగాది ఆస్థానం జరగనుంది. శ్రీవిజయనామ సంవత్సరం సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి చెంత ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉగాది ఆస్థానం…

జిల్లా వార్తలు

పులి దాడిలో రైతు మృతి

బిచ్కుంద: నిజామాబాద్‌ జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్‌ శివారులో ఈ ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58) పై పులి దాడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి నీరు పెడుతుండగా…

జిల్లా వార్తలు

అలంపూర్‌ కోర్టుకు హాజరైన టీ జేఏసీ నేతలు

మహబూబ్‌నగర్‌ : సడక్‌బంద్‌ కేసులో టీఆర్‌ఎస్‌ నేతలు, జేఏసీ నేతలు ఇవాళ అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వాయిదాకు హాజరైన వారిలో టీ జేఏసీ నేతలు ప్రొ.కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేత ఈటెల, జూలల్లి, జితేందర్‌రెడ్డి ఉన్నారు.

జిల్లా వార్తలు

గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట: సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.

హైదరాబాద్

చిక్కడపల్లిలో కల్తీ పాల తమారి ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ : చిక్కడపల్లిలో కల్తీ పాల ప్యాకెట్ల తయారి ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాల ప్యాకెట్లను కట్‌ చేసి పాలల్లో నీళ్లు నింపి రీ ప్యాకింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

ఓ వివాహిత మహిళపై అత్యాచారం

కొండపాక: మెదక్‌ జిల్లా కొండపాక మండలం మాటుపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. అర్ధరాత్రి సిద్ధిపేట నుంచి వస్తూ మాటుపల్లి స్టేజి వద్ద బస్సు దిగి తన ఇంటికి వెళ్తున్న ఓ వివాహిత (24)ను…

హైదరాబాద్

‘ఉచిత కరెంట్‌ బాబు అసాధ్యమన్నారు’

హైదరాబాద్‌ : గతంలో ఉచిత విద్యుత్‌ అడిగితే అసాధ్యమన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. పెంచిన ఛార్జీలు తగ్గించమంటే కాల్పుటు…

జిల్లా వార్తలు

అలంపూర్‌ కోర్టుకు హాజరైన ఐకాస, తెరాస నేతలు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌ కేసులో తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం. శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈరోజు అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌ గడువు ముగియడంతో తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌ రెడ్డి న్యాయస్థానానికి హాజరయ్యారు.

తెలంగాణ

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విజృంభించిన చికెన్‌గున్యా

ఉట్కూరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యాశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.

సీమాంధ్ర

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్లా, డ్రైవర్‌కు గాయాలు

కోరుకొండ : తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఈ రోజు ఉదయం ఓ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయపడ్డాడు. గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీకు…