Wednesday, 4 November 2026

April 2013

అంతర్జాతీయం

వీదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదు : చిరంజీవి

న్యూఢీల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదని ఢీల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన…

జిల్లా వార్తలు

వృత్తికళాశాలలకు మరో గడువు!

హైదరాబాద్‌ :వృత్తివిద్యా కళాశాలలు తమ ఆదాయ, వ్యయ నిర్వహణ వివిరాలు వెల్లడించడానికి తుది గడువును బుధవారం వరకు పొడిగించారు. కళాశాలలు సాయంత్రం అయిదుగంటలలోపు ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఏఫ్‌ఆర్‌)కి నివేదిక అందించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయం

యువతులపై యాసిడ్‌ దాడి

న్యూఢీల్లీ : పాఠశాలనుంచి ఇంటికివెళ్లున్న నలుగురు అక్కాచెల్లెళ్లపై మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన యవతి ఢీల్లీలో చికిత్స పొందుతున్నట్లు పొలీసులు బుధవారం తెలిపారు. అక్కాచెల్లెళ్లలో ముగ్గురు…

జిల్లా వార్తలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యలయంలో సంతకాల సేకరణ

హైదరాబాద్‌ :విద్యుత్‌ చార్జీల పెంపుపై తేదేపా సంతకాల సేకరణ కొనసాగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ సంతకాల సేకరణను ప్రారంభించారు. రేపటి నుంచి గ్రేటర్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు…

వార్తలు

39 మంది విద్యార్థినులకు అస్వస్థత

రెడ్డిగూడెం, కృష్ణా: కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారిని నూజీవీడు ఏరియా అసుపత్రికి తరలించారు. నూజివీడు ఆర్డీవో సుబ్బారావు , ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. బాలికలకు చికిత్స జరుగుతోంది.…

సీమాంధ్ర

గుంటూరు వైద్యకళాశాలలో ఎంపీఐ బృందం తనఖీలు

గుంటూరు వైద్యం : గుంటూరు వైద్య కళాశాలలో 150 నుంచి 200లకు సీట్లు పెంచాలని పంపిన ప్రతిపాదనపై భారత వైద్య మండలి తనిఖీ బృందం బుధవారం కళాశాలకు వచ్చి పరిశీలన జరుపుతోంది. డాక్టర్‌ పాటిల్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ…

జిల్లా వార్తలు

నిమ్స్‌లో భాజపా నేతల దీక్ష విరమణ

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ చార్జీల పెంపునై నిమ్స్‌లో కొనసాగిస్తున్న దీక్షను భాజపా నేతలు విరమించారు. పార్టీ జాతీయ  నేత రవిశంకర్‌ప్రసాద్‌ రాష్ట్ర పార్టీ  అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌, యెండల లక్ష్మీనారాయణలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పాత…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు గంట సమయం పడుతోంది.

సీమాంధ్ర

విజయవాడలో వామపక్షాల ఆందోళన

విజయవాడ : తాగునీరు, డ్రైనేజీ ఛార్జీల పెంపుపై వామపక్షాలు విజయవాడలో ఆందోళనకు దిగాయి. నగర పాలక సంస్థ కమిషనర్‌ ఛాంబంర్‌ను ముట్టడించి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పలువురి నేతలను పోలీసులు అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న జయప్రద

తిరుమల : ఎంపీ జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమలకు వచ్చిట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.