Monday, 2 November 2026

October 2013

హైదరాబాద్

ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సంయుక్త రవాణాశాఖ కమిషనర్‌ ప్రసాద్‌రావును ప్రభుత్వం ఆదేశించింది.

హైదరాబాద్

సీఎస్‌ తో టాస్క్‌ఫోర్స్‌ బృందం భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మహంతితో కేంద్ర హోంశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం సమావేశమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే పలుసమస్యలపై టాస్క్‌ఫోర్స్‌ బృందం సీఎస్‌తో చర్చించట్లు సమాచారం.

హైదరాబాద్

ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) లోని వసతిగృహంలో బోర్డర్‌, నాన్‌బోర్డర్‌ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి., పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపు చేశారు.

హైదరాబాద్

2న రాష్ట్రానికి మన్మోహన్‌ ,సోనియా

హైదరాబాద్‌ : వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీóలు నవంబర్‌ 2న రాష్ట్రానికి రానున్నారు. వీరు గురువారం ఏరియల్‌ సర్వేకి విశాఖపట్నం వస్తారని రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి…

వరంగల్

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో దొంగల బీభత్సం

వరంగల్‌ : జిల్లాలోని నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం పగులగొట్టిన దుండగులు ఫైళ్లు చింపివేసి పరారయ్యారు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

శక్తిఘాట్‌ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రముఖులు

న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ 29వ వర్ధంతి సందర్భంగా శక్తిఘాట్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ,ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ,యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ , పలువురు మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

ఆదిలాబాద్

లారీ – ఆటో ఢీ ముగ్గరు మృతి

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోని జైపూర్‌ మండలం ఇందారం చెక్‌పోస్టు సమీపంలో లారీ – ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి…

హైదరాబాద్

రాష్ట్ర అవరతరణ దినోత్సవం నేపథ్యంలో ….రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవ నేడుకల సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం ,ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ, బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని…

హైదరాబాద్

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి ,1.25లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌లో పేకాటస్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఘటనా స్థలం నుంచి మూడు కార్లు , 10 సెల్‌పోన్లు, రూ.1.25 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.