Tuesday, 3 November 2026

April 2015

హైదరాబాద్

బుధవారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రేపటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ కౌన్సింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మే ఏడో తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ జరపనున్నట్లు వీసీ రవిరాజు తెలిపారు. మే…

సీమాంధ్ర

కడప డీసీసీబీ ఛైర్మన్ పై హైకోర్టులో విచారణ..

కడప : జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి నోటీసులు లేకుండానే ఇద్దరు డైరెక్టర్ లను తొలగించారని వైసీపీ నేతలు హైకోర్టుకు తెలిపారు.

హైదరాబాద్

ఆర్టీసీ విభజన వేగవంతం..

హైదరాబాద్ : ఆర్టీసీ విభజన వేగవంతమైంది. ఇరు రాష్ట్రాల సిబ్బంది విభజనను అధికారులు పూర్తి చేశారు. మే 14 నుండి విడివిడిగా కార్యకలాపాలను ఎపిఎస్ ఆర్టీసీ, టిఎస్ ఆర్టీసీ నిర్వహించనుంది.

జాతీయం

బీహార్ లో రోడ్డు ఆక్సిడెంట్..ఇద్దరు మృతి..

బీహార్ : నలందా జిల్లా సక్ రాల్ గ్రామ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

జాతీయం

బుధవారం సీఎస్ఆర్ జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి..

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సును బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.

హైదరాబాద్

బాబును కలిసిన టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును టి.టిడిపి నేతలు కలిశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై బాబు ఆరా తీశారు. మహనాడును నగరంలో నిర్వహించాలన్న నేతల కోరికపై బాబు సానుకూలంగా స్పందించారు.

Main

ఆర్డీఓ, డిప్యూటి డైరక్టర్, ఆర్ఐ లపై వేటు..

నల్గొండ : యాదగిరిగుట్టలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఆర్డీఓ సోములు నాయక్, డిప్యూటి డైరెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐ నాగరాజ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గుట్ట పరిధిలోని ఆరు గ్రామాల్లో రిజిస్ట్రేషన్ లను నిలిపివేస్తూ…