Tuesday, 3 November 2026

October 2015

హైదరాబాద్

నేడు ఎస్టీ రిజర్వేషన్ సాధన సమితి అసెంబ్లీ ముట్టడి.

హైదరాబాద్ : నేడు ఎస్టీ రిజర్వేషన్ సాధన జేఏసీ అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుండి 10 శాతానికి పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.

రంగారెడ్డి

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి.

రంగారెడ్డి : షామిర్ పేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కిరణ్ పై అమ్మాయి బంధువులు దాడికి యత్నించారు. కత్తులతో దాడి చేయడంతో కిరణ్ తీవ్రగాయాలకు పాలయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర

రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ వాగ్వాదం..

0 inShare శ్రీకాకుళం : రిమ్స్ వైద్య సిబ్బందితో ప్రభుత్వ విప్ రవికుమార్ వాగ్వాదానికి దిగారు. పొందూరుకు చెందిన రోడ్డుప్రమాద బాధితుడు సింహాచలానికి సకాలంలో వైద్యం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయం

పదకొండేళ్ల బాలుడు ఎనిమిదేళ్ల బాలికపై కాల్పులు

చికాగో: కుక్కపిల్లకోసం ఇద్దరు చిన్నారుల మధ్య తలెత్తిన గొడవ ప్రాణం తీసింది. పదకొండేళ్ల బాలుడు తన పక్కింట్లో ఉంటున్న ఎనిమిదేళ్ల బాలికపై కాల్పులు జరపడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెన్నస్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.…

Featured News

రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

హైదరాబాద్‌: చిత్తూరు జిల్ల పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పర్‌లో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీతో స్మగ్లర్లు టిప్పర్‌ను వదిలేసి పరారయ్యారు.

సీమాంధ్ర

పాఠశాల బస్సు బోల్తా: 10మంది విద్యార్థులకు గాయాలు

పుల్లల చెరువు: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఎం.ఎర్రబాలెం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం……

సీమాంధ్ర

ఐదేళ్ల బాలుడి అపహరణ

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. పాఠశాలకు వెళ్తున్న బాలుడిని ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

బ్యాంకులో చోరీకి యత్నం

:కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గొడ్డళ్లతో లాకర్లను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరుచుకోక పోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. బ్యాంకు…