Tuesday, 3 November 2026

పాఠశాల బస్సు బోల్తా: 10మంది విద్యార్థులకు గాయాలు

పుల్లల చెరువు: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఎం.ఎర్రబాలెం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం… ఎం.ఎర్రబాలెం గ్రామం నుంచి ముటుకుల లోని సిద్ధార్థ ప్రైవేటు పాఠశాలకు బస్సులో సుమారు 50మంది విద్యార్థులు బయల్దేరారు. డ్రైవర్‌ మద్యం మత్తులో బస్సును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలవ్వగా, మరో ఐదుగురికి స్వల్ప గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట ఆసుపత్రులకు తరలించారు. కొందరు విద్యార్థులకు గ్రామంలోనే చికిత్స అందించారు. డ్రైవర్‌ మద్యం సేవించి బస్సును నడపడమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *