2019లో కాంగ్రెస్‌దే అధికారం 

– తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి
తిరుమల, ఆగస్టు2(జ‌నం సాక్షి) : 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలకులు తప్ప, ప్రజలు సంతోషంగా లేరన్నారు. తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలోనూ లేదని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు అధికారాలు లేవని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేసీఆర్‌ కూతురు కవితతో సహా టీఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యులు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కాగితాలపై తప్ప వాస్తవంగా లేదని వ్యాఖ్యానించారు.

తాజావార్తలు