Tuesday, 3 November 2026

20,21న బ్యాంకు అధికారుల సమ్మె

చెన్నై : బ్యాంకు అధికారులు సమ్మె చేయనున్నారు. తమ కోర్కెలకు మద్దతుగా అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) పిలుపు మేరకు ఈ నెల 20,21న బ్యాంకు అధికారుల విధులకు హాజరు కారు. అధికారుల సమ్మె కారణంగా చెక్కుల లావాదేవీలు, ఇతర కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని ఏఐబీఓఏ జనరల్‌ సెక్రటరీ ఎన్‌. నాగరాజన్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ పరిశ్రమంలో ఏఐబీఓఏ రెండో అతిపెద్ద అధికారుల సంఘం. బ్యాంకుల విలీనాల నిలిపివేత, వేతన సమానత్వం తదితర అంశాలను పరిష్కరించాలని బ్యాంకు అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *