ఆదిలాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): తెలంగాణ నాన్‌గజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్‌జీవో) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఈనెల 22న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకుఏర్పాట్లు చేస్తున్నారు. 22న జరిగే ఎన్నికలకు ముందు 18,19 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల పరిశీలన జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.సంఘకార్యాలయంలో జరిగిన అత్యవసరబభేటీలో ఈమేరకు తీర్మానించారు. అయితే ప్రస్తుతం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులైన అశోక్ వనజారెడ్డిలనే మరోమారు కొనసాగించాలన్న నిర్ణయానికి మెజార్జీ సభ్యులు వచ్చారు. తిరిగి వీరి ఎన్నిక లాంఛనమే అని ఆయా తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు చెప్పినప్పటికీ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేయాలని ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని నిర్ణయించారు.




