Thursday, 5 November 2026

23న ఏపీకి రాహుల్‌ గాంధీ రాక!

– సీఎం చంద్రబాబు ఇచ్చే విందుకు హాజరు
– రాహుల్‌తో సహా ఇతర రాష్ట్రాల్లోని బీజీపీయేతర పార్టీ నేతల రాక
అమరావతి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 23న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి రాబోతున్నట్లు సమచారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన అదేరోజు ‘చంద్రబాబు’ ఇచ్చే విందుకు హాజరు కాబోతున్నారు. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి గడుతోన్న ‘చంద్రబాబు’కు మద్దతు తెలపడానికి?ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక¬దా ఇవ్వాలనే డిమాండ్‌కు వారంతా మద్దతు పలకబోతున్నట్లు సమాచారం. రాహుల్‌ గాంధీతో పాటు ‘మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్‌యాదవ్‌, ఫారూక్‌ అబ్దుల్లా, తేజస్విని యాదవ్‌తో పాటు మరి కొందరు కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గోబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కూటమి నేతలు ఇక్కడ ర్యాలీ నిర్వహించనున్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక¬దా ఇస్తామని ప్రకటించనున్నారు. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూటమికి మద్దతుగా వీరు ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాయమావతి, రాహుల్‌గాంధీ, శరత్‌పవార్‌, ఫారూక్‌ అబ్దుల్లా, అఖిలేష్‌ యాదవ్‌, కర్ణాటక సీఎం కుమారస్వామి, దేవగౌడ, డీఎంకే నేత స్టాలిన్‌ తదితరులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈమేరకు అందరూ చంద్రబాబుకు మద్దతుగా నడిచేందుకు, చంద్రబాబు ఏర్పాటు చేయబోయే కూటమిలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు. దీంతో మొత్తం విూద మొన్నటి దాకా తనకు ఎదురేలేదనుకున్న ‘మోడీ’కి  చంద్రబాబు’ చుక్కలు
చూపిస్తున్నారు. అదే విధంగా ‘జాతీయ విూడియా’ మొత్తం ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతోంది. ఆయన ఎప్పుడేం చేస్తారో.. ఎక్కడికి వెళుతున్నారో?రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయో.. అనే విషయంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ హడావుడి చేస్తున్నాయి. ఈనెల 23న ఏపీలో జరగబోయే బీజేపీయేతర పక్షాల నేతల సమావేశంతో ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి సంచనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.