హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రానికి 23 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ బలగాలన్నీ సీమాంధ్ర ప్రాంతాలకు తరలి వెళ్లనున్నాయి. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కడప, తిరుపతి, విశాఖ. విజయవాడ, గుంటూరులో బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ జిల్లాలకు ఇప్పటి వరకూ కేంద్ర బలగాలను పంపలేదు. సీఆర్పీఎఫ్ 8 కంపెనీలు ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్ 8 కంపెనీలు, బీఎస్‌ఎఫ్ 7 కంపెనీల బలగాలు రానున్నాయి.




