హైదరాబాద్ : అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో 23 కార్మికులకు గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి గెరడప్ ఉక్కు కర్మాగారానికి ఆటోలో 26 మంది కార్మికులు బయలు దేరారు. రోడ్డు సరిగా లేకపోవడంతో కర్మాగారానికి అరకిలోమీటరు దూరంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.




